News March 7, 2025
నరసరావుపేట ఎమ్మెల్యే ధర్నా

నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హల్‌చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై ఎక్సైజ్ కమిషనర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడికి చేరుకొని నిరసన తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా ఎమ్మెల్యే అంగీకరించలేదని సమాచారం. చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Similar News
News March 21, 2025
IPL: కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగలరా?

రేపటి నుంచి అతిపెద్ద క్రికెట్ పండుగ IPL మొదలు కానుంది. ఈ టోర్నీలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ గెలుచుకునేదెవరనే దానిపై క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే కోహ్లీపై ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా? అనేదానిపై చర్చ జరుగుతోంది. కోహ్లీ 2016 IPLలో 973 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గిల్ (890), బట్లర్(863), వార్నర్(848) ఉన్నారు. కోహ్లీ రికార్డును ఎవరు బ్రేక్ చేయగలరు? COMMENT?
News March 21, 2025
వామ్మో.. లండన్ కాదు దొంగల డెన్!

లండన్ అనగానే చక్కటి అందాలు మనకు గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా లండన్ చోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన ఏడాది కాలంలో 83వేల ఫోన్లు చోరీకి గురయ్యాయి. లండన్ వీధుల్లో చేతుల్లో ఫోన్ పెట్టుకుని నడిస్తే ఇక ఫోన్ పోయినట్లేనని స్థానికులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గడచిన వారంరోజుల్లో 230మంది దొంగల్ని అరెస్ట్ చేశారు.
News March 21, 2025
నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్‌లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.