News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.
Similar News
News April 15, 2025
మల్కాజిగిరి: ఎన్యూమరేటర్ల పారితోషికం ఎక్కడ..?

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,780 మంది ఎన్యూమరేటర్లు, 2,070 మంది సూపర్వైజర్లు కుటుంబ సర్వేల్లో పాల్గొన్నారు. ఒక్కో న్యూమరేటర్ రోజుకు 10 కుటుంబాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించగా సర్వే పూర్తైంది. అయినప్పటికీ వీరికి ఇవ్వాల్సిన రూ.3.99 కోట్ల పారితోషికం ఇంకా విడుదల చేయలేదని, ప్రజావాణిలో విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 15, 2025
మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.
News April 15, 2025
పోస్టల్ సర్వీస్నూ వదల్లేదు.. ఎంతకు తెగించార్రా?

గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. చివరికి పోస్టల్ సర్వీస్నూ వదల్లేదు. యూనియన్ టెరిటరీ దాద్రానగర్ హవేలీలోని దీవ్ నుంచి పోస్ట్ మాస్టర్ సాయంతో మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పోస్టల్ స్టాంప్ ఉన్న పార్శిల్స్ చెక్ చేయరని ఈ దారి ఎంచుకున్నారు. కానీ బార్డర్లో పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.