News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.
Similar News
News April 11, 2026
సిద్దిపేట: ’18 మందికి రూ.1,83,500 జరిమానా’

సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా స్పెషల్ సెకండ్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ రూ.1,83,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ముగ్గురికి రూ.15వేలు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదకరమని, నియమాలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు.
News April 11, 2026
ద్వారకాతిరుమల: 26 నుంచి శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు అన్ని సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామన్నారు.
News April 11, 2026
ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.


