News March 9, 2025
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిర్యాదులు రాసి ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.
Similar News
News February 25, 2026
రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న KTR

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News February 25, 2026
YELLOW ALERT: రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.
News February 25, 2026
ఇంటర్మీడియట్ పరీక్షలపై కలెక్టర్–ఎస్పీ సంయుక్త పర్యవేక్షణ

గద్వాల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. ఈ నేపథ్యంలో గద్వాల్ పట్టణంలోని జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.


