News March 9, 2025

నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే

image

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిర్యాదులు రాసి ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.

Similar News

News November 13, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా.. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్‌లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం 72,283 మంది స్వామి వారిని దర్శించుకోగా… 22,583 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News November 13, 2025

మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

image

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?

News November 13, 2025

జిల్లాలో వందే భారత్.. నరసాపురం వరకు పొడిగింపు

image

జిల్లాలో మొట్ట మొదటిగా వందే భారత్ రైలు నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 20677 రైలు చెన్నై నుంచి జనవరి 12న 5.30 బయలుదేరి 14.10కి నరసాపురం చేరుతుంది. తిరిగి అదే రోజు నరసాపురంలో 14.50 బయలుదేరి 23.45కు చెన్నై చేరుతుంది. జిల్లాలో ఈ రైలు భీమవరం, నరసాపురంలో ఆగుతుంది.