News July 15, 2024

నరసరావుపేట: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ శ్రీనివాసరావు

image

పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కలెక్టర్ పి. అరుణ్ బాబును కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలపై కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.

Similar News

News October 13, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.

News October 13, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలలో బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం: ఎస్పీ

image

దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. బైక్ అంబులెన్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ 8340000108, 8186000108నంబర్లు ఇవే.

News October 13, 2024

గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల

image

గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.