News February 16, 2025
నరసరావుపేట: జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం ఎస్పీ కె.శ్రీనివాసరావు నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసులు, చోరీలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలన్నారు. 112 ఎమర్జెన్సీ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీ సంతోశ్ ఉన్నారు.
Similar News
News April 17, 2026
రోజూ తలస్నానం చేయొచ్చా?

రోజూ తలస్నానం చేయడం జుట్టుకు హానికరమనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యం స్కాల్ప్(మాడు) రకం, వాడే షాంపూపైనే ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే చుండ్రు తొలగి జుట్టు శుభ్రంగా ఉంటుంది. డ్రై స్కాల్ప్ లేదా కలర్డ్ హెయిర్ ఉన్నవారు తరచూ చేస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంది. సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలు వాడితే రోజూ స్నానం చేసినా ప్రాబ్లమ్ ఉండదు.
News April 17, 2026
APPLY NOW: NICలో 153 ఉద్యోగాలు

153 పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), న్యూఢిల్లీ దరఖాస్తులను కోరుతోంది. వీటిలో సైంటిఫిక్-C-12, సైంటిస్ట్-D-141 పోస్టులున్నాయి. B.E/B.Tech/M.Sc/ME /M.Tech/M.Philతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. సైంటిస్ట్-Cకు 35, సైంటిస్ట్-Dకు 40 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30.4.26. మరిన్ని వివరాలకు recruitment.nic.in చూడండి.
News April 17, 2026
శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.


