News March 30, 2025
నరసరావుపేట: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని కోరారు.
Similar News
News April 3, 2025
VKB: భారీ వర్షాలు.. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టరేట్లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్నందున ఎక్కడైనా సమస్య ఏర్పడితే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేస్తే సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 3, 2025
11వ తేదీలోగా అభ్యంతరాలు తెలపండి: డీఈవో

అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు.
News April 3, 2025
మహబూబ్‌నగర్: BRS వాళ్లకు కాంగ్రెస్ నేత WARNING

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై BRS నాయకులు బురదజల్లే చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ హెచ్చరించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ఎన్నో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, అక్కడ మాజీ మంత్రి కూర్చోకుండా తనకు కుర్చీ వేయలేదంటూ అనవసర రాద్ధాంతం చేశారన్నారు.