News March 22, 2024

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు

image

టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News October 15, 2025

గుంటూరు: ఆటో డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

image

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోటి వెంకట రెడ్డికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంగళవారం 3 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాలను సమర్పించడంతో నిందితుడు దోషిగా తేలాడు. విచారణలో ఎస్ఐ అమీర్, ఏపీపీ శౌరి కృషి చేశారు. ఎస్పీ పోలీసులను అభినందించారు.

News October 15, 2025

నాయీ బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

image

నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కురగంటి రఘురామయ్య తెనాలిలో తెలియజేశారు. షాపు వద్దకు విద్యుత్ శాఖ సిబ్బంది వస్తే మీటర్ నంబరు, వివరాలు చెప్పవలసి ఉంటుందన్నారు. విద్యుత్ 200 యూనిట్లు మించకుండా ఉంటే ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు. నాయి బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

News October 15, 2025

ధాన్యం కొనుగోళ్లు పారదర్శకతతో చేపట్టాలి : కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకతతో చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందే గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనెసంచులు అందుబాటులో లేకపోవడం, రవాణాలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం అనే ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.