News March 11, 2025
నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలకు 90% హాజరు

పల్నాడు జిల్లాలో దూరవిద్య ఇంటర్మీడియట్ పరీక్షలకు 90 శాతం మంది విద్యార్థులు సోమవారం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎన్. చంద్రకళ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లలో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 1,950 మంది విద్యార్థులకు 1,762 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. నరసరావుపేట సత్తెనపల్లి, వినుకొండ పరీక్షా కేంద్రాలను డీఈవో చంద్రకళ తనిఖీ చేసి, ఏర్పాట్లపై సూచనలు చేశారు.
Similar News
News February 9, 2026
కాకినాడ: తీరప్రాంత పర్యాటకానికి కొత్త శోభ

కాకినాడ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 67.83 కోట్లు కేటాయించిందని MP తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ బదులిస్తూ.. హోప్ ఐలాండ్, కోరింగ, కోటిపల్లి సర్క్యూట్‌ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో తీరప్రాంత పర్యాటకానికి కొత్త శోభ రానుందని ఎంపీ పేర్కొన్నారు.
News February 9, 2026
ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.
News February 9, 2026
NGKL: జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బహిరంగ ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టారు. మైకులు మూగబోవడంతో పోలీసులు మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి.


