News February 10, 2025

నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ రద్దు

image

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 10, 2025

సంగారెడ్డిలో 1100 మందితో ఎన్నికల బందోబస్తు

image

సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఏడు మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 1,100 మంది పోలీసు అధికారులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరీతోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News December 10, 2025

మీరు గెలిస్తే ప్రజల తీర్పు.. మేం గెలిస్తే ఓట్ చోరీనా?: కలిశెట్టి

image

AP: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై YCP MP మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడిన తీరు హాస్యాస్పదమని TDP MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ‘ఓట్ చోరీ‌పై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విజయనగరం, చిత్తూరు, హిందూపూర్‌లో ఓట్ల చోరీ జరిగినట్టు ఆయన చెప్పారు. YCP గెలిచినప్పుడు ప్రజాస్వామ్య తీర్పు అన్నారు. మేం గెలిస్తే ఓట్ చోరీ అంటున్నారు. YCP హయాంలో పలు ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారు’ అని మండిపడ్డారు.

News December 10, 2025

మద్యం ప్రియులకు షాక్.. 10 మండలాల్లో 3 రోజులు బంద్

image

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం డ్రై డే ప్రకటించింది. డిసెంబర్ 11న జరగనున్న పోలింగ్ దృష్ట్యా, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు 10 మండలాల్లో మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. DEC 9 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.