News February 7, 2025
నరసరావుపేట: పి-4 పాలసీ అమలు పై వీడియో కాన్ఫరెన్స్

ప్రభుత్వ ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి పి-4 ప్రణాళికపై రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2026
రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.
News March 14, 2026
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 45 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 8,157 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 4,156 మంది బాలురు, 4001 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు అరగంట ముందే చేరుకోవాలన్నారు.కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు.
News March 14, 2026
గ్యాస్ సరఫరాపై నిరంతర నిఘా: కలెక్టర్

సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


