News April 29, 2024
నరసరావుపేట: పోటీలో 122 మంది అభ్యర్థులు

నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ శివ శంకర్ సోమవారం తెలిపారు. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పెదకూరపాడు 11, చిలకలూరిపేట 25, నరసరావుపేట 14, సత్తెనపల్లి 15, వినుకొండ 14, గురజాల 13, మాచర్ల 15 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రభుత్వాధికారి కథ ఇది.!

1957 బ్యాచ్కు చెందిన IAS అధికారి S.R. శంకరన్ పేరుమీద మన గుంటూరు కలెక్టరేట్ ఒక కాన్ఫరెన్స్ హాలు ఉందని మీకు తెలుసా?. S.R శంకరన్ 1934, అక్టోబర్ 22న జన్మించారు. 1957లో IASగా ప్రస్థానం మొదలుపెట్టి, 1992లో పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ కోసం పెళ్లి దూరంగా ఉన్నారు. తనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.
News October 22, 2025
GNT: వారు తడబడినా.. మనమే ఆత్మవిశ్వాసం నింపాలి.!

ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. గుంటూరు జిల్లాలో పెద్దలలో తడబడటం సుమారు 1% వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. పిల్లల్లో మొదట్లో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. స్పీచ్ థెరపిస్టులు తడబడే సహాయం చేస్తున్నప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం.
News October 21, 2025
ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.