News September 9, 2024

నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 50 దరఖాస్తులు

image

ప్రకృతి విపత్తులు నెలకొన్నప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 50 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News October 7, 2024

టీడీపీలోకి మోపిదేవి.. ముహూర్తం ఫిక్స్..?

image

వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారని అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News October 7, 2024

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు.?

image

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు GMC అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రి 10 గంటల తర్వాత భోజనం, టిఫిన్, హోటల్‌లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు ఆహార ప్రియులు కోరుకున్న పదార్థాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. 4ఏళ్ల కిందట ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా కరోనాతో అవి కనుమరుగయ్యాయి.

News October 7, 2024

కొల్లూరు: కృష్ణానదిలో యువకుడి గల్లంతు

image

కృష్ణా నది తీరానికి వచ్చిన ఓ యువకుడు నదిలో మునిగి గల్లంతైన ఘటన ఆదివారం కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. తెనాలి బీసీ కాలనీకి చెందిన నరేశ్(20)మరో ఆరుగురు నది తీరానికి వచ్చి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బాల్ కొద్ది దూరం కొట్టుకొని వెళ్లడంతో తీసుకొచ్చేందుకు వెళ్లిన నరేశ్ కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.