News August 14, 2024
నరసరావుపేట: ‘ప్రతి ఇంట మువ్వన్నెల జెండా ఎగురవేయాలి’

దేశభక్తిని సమైక్యతను చాటి చెప్పెలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలోని పాఠశాలలో జాతీయ సమైక్యతపై పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రతి మండల కేంద్రం, జిల్లాలోనున్న ఇంజినీరింగ్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలన్నారు. సెల్ఫీ తీసుకున్న ఫోటోలు వెబ్సైట్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News October 19, 2025
గుంటూరు: ‘కాలుష్యం లేని దీపావళి..ఆనందమైన దీపావళి’

కాలుష్యం లేని దీపావళి ఆనందమైన దీపావళిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దీపావళిపై రూపొందించిన పోస్టర్ను శనివారం కలెక్టర్ విడుదల చేశారు. దీపాలను వెలిగించడం మన సంస్కృతిలో భాగమని కాలుష్యానికి కారణమయ్యే టపాసుల జోలికి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఈ నెల 20న దీపావళి పండగ సందర్భంగా ప్రజలు హరిత టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
News October 18, 2025
GNT: వారి భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోలీసులు గంజాయి పట్టుకుంటున్నారు. ఇటీవల యువతలో మాదకద్రవ్యాల వాడకం పెరగటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాల వాడకానికి దారితీసే అనుమానాస్పద ప్రవర్తన, స్నేహ వర్గం, ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. @ యువ భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత.!
News October 18, 2025
లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్లు కలిగిన నర్సింగ్ హోమ్లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.