News August 14, 2024

నరసరావుపేట: ‘ప్రతి ఇంట మువ్వన్నెల జెండా ఎగురవేయాలి’

image

దేశభక్తిని సమైక్యతను చాటి చెప్పెలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలోని పాఠశాలలో జాతీయ సమైక్యతపై పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రతి మండల కేంద్రం, జిల్లాలోనున్న ఇంజినీరింగ్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలన్నారు. సెల్ఫీ తీసుకున్న ఫోటోలు వెబ్సైట్‌సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు. 

Similar News

News September 15, 2024

యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

image

యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 15, 2024

నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.

News September 15, 2024

గుంటూరులో బాలికపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్

image

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థినిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్. కాలేషా అనే వ్యక్తి భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.