News February 1, 2025

నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాల కొనుగోళ్లకు ఒప్పందం

image

పల్నాడు జిల్లాలోని మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 16 కీలక వైద్య పరికరాలను రూ.72.98 లక్షల నిధులతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పవర్ గ్రిడ్ సాదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్‌మీషన్ సిస్టం లిమిటెడ్ ఈ నిధులను చేకూరుస్తుంది. ఈ మేరకు కలెక్టర్ పి. అరుణ్ బాబు సమక్షంలో పీఎస్ఎల్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు మధ్య ఎంఓయు జరిగింది. ఈ సంస్థ సహకారంతో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరచవచ్చన్నారు.

Similar News

News November 28, 2025

అనకాపల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

image

యుపీఎస్సీ సివిల్స్‌కు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకు సిద్ధం అయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే.శ్రీదేవి తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు 2 ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ జత చేయాలన్నారు.

News November 28, 2025

ఖమ్మం: వరి కొయ్యలను కాల్చొద్దు.. కలియ దున్నాలి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం మానుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి, పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు తెలిపారు. దానికి బదులుగా, వ్యర్థాలను పొలంలోనే కలియదున్నడం వంటి పద్ధతులను అనుసరించాలని కోరారు. దీని వల్ల మట్టిలో పోషకాలు పెరిగి, భూసారం మెరుగుపడుతుందని అధికారులు రైతులకు వివరించారు.

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.