News February 12, 2025
నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 45 వేల ఇంజెక్షన్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటు వచ్చిన వారికి తొలి గంటలో ఇచ్చే రూ. 45వేలు విలువైన అత్యవసర టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉందని సూపరింటెండెంట్ డా. రంగారావు తెలిపారు. ఎంతో ఖర్చుతో ఉన్న ఇంజెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. గుండె నొప్పి రోగులకు స్వాంతన చేకూరేలా ఇంజెక్షన్ పనిచేస్తుందని వివరించారు. ఫిజీషియన్ స్పెషలిస్ట్ చే వ్యాధిగ్రస్తులకు ఇంజెక్షన్ ఇస్తున్నామని తెలిపారు.
Similar News
News September 16, 2025
ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.
News September 16, 2025
మార్కాపురం: రూ.25 వేల జీతంతో జాబ్స్

మార్కాపురంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 10 జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, పది నుంచి పీజీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు జీతం అందుతుందన్నారు.
News September 16, 2025
పెద్దపల్లి: ‘యువత మత్తుకు బానిస కావొద్దు’

మత్తుకు బానిస కాకుండా యువత దేశానికి మార్గదర్శకంగా నిలవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ అన్నారు. ఈగల్ నినాదంతో మత్తు నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంగళవారం పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు వ్యతిరేక ర్యాలీ, అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.