News May 18, 2024
నరసరావుపేట బయల్దేరిన సిట్ బృందం
ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఘటనలకు గల కారణాలకు అన్వేషించడానికి సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ బృందం నరసరావుపేట బయల్దేరింది. రెండు రోజుల్లో సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. దాని ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. సిట్ బృందం నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది.
Similar News
News December 9, 2024
పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
News December 9, 2024
ఎన్జీవో కాలనీలో NTR విగ్రహావిష్కరణ చేసిన పెమ్మసాని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News December 8, 2024
జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ సేవలు: కలెక్టర్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.