News January 25, 2025
నరసరావుపేట: బాలికల వసతి గృహంలో అధికారుల విచారణ

నరసరావుపేట ఎస్సీ కళాశాల బాలికలహాస్టల్ లో విద్యార్థిని గర్భం దాల్చి, రక్తస్రావంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కుమిదిని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శివనాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జోత్స్న హాస్టల్లో విచారణ చేపట్టారు. చదువుకుంటున్న విద్యార్థిని (16) ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Similar News
News February 7, 2025
NRPT: ఐదుగురిపై కేసు నమోదు

సురక్షిత ప్రయాణానికి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్ఐ రేవతి అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలోని పలు కోడెలలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 36 వాహనాలకు రూ.12,520 జరిమానాలు, పెండింగ్లో ఉన్న 61 వాహనాల జరిమానాలు వసూలు చేసినట్లు చెప్పారు. ఐదుగురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
News February 7, 2025
సినిమా రంగంలో కురవి కుర్రాడు!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.