News June 29, 2024
నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు

మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News December 9, 2025
స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఆరోగ్య అధికారి

జిల్లా ఆరోగ్య అధికారి డా. విజయలక్ష్మి స్క్రబ్ టైఫస్పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేడ పురుగు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయని తెలిపారు. జీజీహెచ్‌లో IGM ELISA పరీక్ష అందుబాటులో ఉంది. పొదలు, పొలాల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి దుస్తులు ధరించాలని, లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
News December 9, 2025
21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం: కలెక్టర్

ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 9, 2025
గుంటూరు జిల్లా డీఈఓగా సలీం బాషా

గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ)గా షేక్ సలీం బాషా నియమితులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఈఓగా, కృష్ణాజిల్లా DIET కళాశాల ప్రిన్సిపల్‌గా ఉన్న ఆయనను గుంటూరు బదిలీ చేస్తూ మంగళవారం విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు డీఈఓ రేణుకను ప్రకాశం జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.


