News June 29, 2024
నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు
మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 8, 2024
నేడు లేదా రేపు TDPలోకి మోపిదేవి వెంకటరమణ..?
YCP మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ నేడు లేదా రేపు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గమైన రేపల్లె, విజయవాడలోని తన సామాజికవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన TDP కండువా కప్పుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆయన YCPకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
News October 8, 2024
తుళ్ళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ
కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగిన ఘటన తుళ్ళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరిరావు, పావని దంపతులు. కొంతకాలంగా అత్త, కోడలికి మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కోడలి తరఫు బంధువులు, అత్తవైపు వారు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కోడలు అత్త చెవి కొరకడంతో సగభాగం ఊడి కింద పడిపోయింది. గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లినా అతికించలేమని వైద్యులు చెప్పారు.
News October 8, 2024
నేటి నుంచి ANUలో రాష్ట్ర స్థాయి సీనియర్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంగళవారం నుంచి 4రోజులు రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన పురుషుల జట్లు పాల్గొంటాయన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారన్నారు.