News August 29, 2024
నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News December 17, 2025
గుంటూరు ఎంపీ పనితీరుపై IVRS సర్వే

టీడీపీ MPల పనితీరుపై పార్టీ అధిష్ఠానం IVRS సర్వే చేపట్టింది. మంగళవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 08645417579 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎంపీ పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎంపీలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ప్రజల రెస్పాండ్ ఎలా ఉందో చూడాలి.
News December 16, 2025
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు?

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్గా పనిచేస్తున్నారు.
News December 16, 2025
GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


