News August 29, 2024
నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News September 12, 2024
గుంటూరు: డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం
ANU ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి.ఎం.ప్రసాద్ తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.
News September 12, 2024
గుంటూరు: యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు
సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు జడ్జ్) కేసును ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
News September 11, 2024
మంత్రి లోకేశ్‌కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత
వరదలతో నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన చెక్కును మంత్రి లోకేశ్‌కు సచివాలయంలోని 4వ బ్లాక్‌లో అందజేశారు. ఆయనతో పాటు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు రూ.1 కోటి వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. వారికి మంత్రి ధన్య వాదాలు తెలిపారు.