News March 20, 2025
నరసరావుపేట యువకుడికి గేట్లో 6వ ర్యాంకు

గేట్ పరీక్ష ఫలితాల్లో నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన 2025 గేట్ పరీక్ష ఫలితాలను బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 20, 2025
‘డ్యూడ్’, ‘K-Ramp’ కలెక్షన్లు ఎంతంటే?

* ప్రదీప్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ 3 రోజుల్లో రూ.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, నిన్న రూ.21 కోట్లు రాబట్టింది.
* కిరణ్ అబ్బవరం, యుక్తి జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ 2 రోజుల్లో రూ.5.1 కోట్లు(నెట్) కలెక్ట్ చేసినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది.
News October 20, 2025
బాబర్ పని అయిపోయిందా?

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 16 పరుగులకే ఔటయ్యారు. బాబర్ గత 75 ఇన్నింగ్సుల్లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా చేయలేదు. సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. గత 15 టెస్టు ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16గా ఉన్నాయి. సగటు 18.40 కాగా హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయారు.
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.