News March 20, 2025
నరసరావుపేట: వర్క్ ప్రెజర్ వల్లే ఆత్మహత్య?

నరసరావుపేటలో బల్లికురవ(M) గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు(29) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్యకు పని ఒత్తిడే కారణమని సమాచారం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన.. వర్క్ ప్రెజర్ వల్ల జాబ్ చేయలేకపోతున్న అంటూ సూసైడ్ నోట్లో రాసినట్లు తెలుస్తోంది. ఉద్యోగం వదిలేస్తే భార్య తరఫు బంధువులు మాటలు అంటారేమో అని, అమ్మ, నాన్న క్షమించండి అని సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం.
Similar News
News September 15, 2025
మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్‌పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 15, 2025
హిమాయత్‌సాగర్‌కు తగ్గిన వరద ఉద్ధృతి

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతి తగ్గడంతో జలాశయం ఒక ట్రస్ట్ గేటు 3 ఫీట్ల మేర ఎత్తి 990 క్యూసెక్కుల నీరు ఈసీ నదిలోకి వదిలారు. వరద తగ్గడంతో హిమాయత్‌సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే ఔటర్ సబ్ రోడ్డుపై రాకపోకలను పునరుద్ధరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.15 అడుగులుగా ఉంది.