News April 9, 2025
నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 17, 2025
నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 17, 2025
సంగారెడ్డి : ఉత్సాహంగా కరాటే ఉమ్మడి జిల్లా పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 19 కరాటే పోటీలు శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించారు. SFG జిల్లా కార్యదర్శి గణపతి పోటీలను ప్రారంభించారు. గుమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కరాటే పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని కార్యదర్శి గణపతి తెలిపారు.
News October 17, 2025
3 రోజులు సెలవులు!

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.