News March 17, 2025

నరసరావుపేట: విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ సర్వీసులు

image

పదవ తరగతి విద్యార్థుల కోసం అదనంగా పల్నాడు జిల్లాలో 70 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ప్రజా రవాణా అధికారి మధు తెలిపారు. చిలకలూరిపేట-13, సత్తెనపల్లి- 11,మాచర్ల- 4, పిడుగురాళ్ల -15 అదనంగా నడుపుతున్నామన్నారు. పరీక్షా సమయానికి అనుకూలంగా బస్ సర్వీసులు ఉంటాయన్నారు. పూర్తిగా ఉచిత ప్రయాణానికి విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ జిల్లా అధికారి మధు పేర్కొన్నారు. 

Similar News

News November 25, 2025

KUDA ఆధ్వర్యంలో రూ.584 కోట్ల పనులు!

image

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో WGL నగరంలో రూ.584 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. KUDA 1,805 స్క్వేర్ కి.మీ ఏరియాలో సేవలు అందిస్తోంది. 181 రెవెన్యూ గ్రామాలతో మొత్తం 13 లక్షల జనాభా ఉంది. ఇప్పటికే రింగ్ రోడ్, కాళోజీ కళాక్షేత్రాలను రూ.352 కోట్లతో నిర్మించగా, తాజాగా రూ.110 కోట్లతో టెంపుల్ టూరిజం పేరిట భద్రకాళి బండ్, మరో రూ.150 కోట్లతో గేట్ వేలు, జంక్షన్లు, బస్టాండ్లను నిర్మించబోతున్నారు.

News November 25, 2025

NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

image

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

News November 25, 2025

ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. వారే కీలకం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఖమ్మంలో 8,02,691మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే 26,182 మంది, కొత్తగూడెంలో 6,69,048 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 18,934 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులను నిలపాలని యోచిస్తున్నాయి. కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను పోటీకి సిద్ధం చేస్తున్నారు.