News March 17, 2025

నరసరావుపేట: విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ సర్వీసులు

image

పదవ తరగతి విద్యార్థుల కోసం అదనంగా పల్నాడు జిల్లాలో 70 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ప్రజా రవాణా అధికారి మధు తెలిపారు. చిలకలూరిపేట-13, సత్తెనపల్లి- 11,మాచర్ల- 4, పిడుగురాళ్ల -15 అదనంగా నడుపుతున్నామన్నారు. పరీక్షా సమయానికి అనుకూలంగా బస్ సర్వీసులు ఉంటాయన్నారు. పూర్తిగా ఉచిత ప్రయాణానికి విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ జిల్లా అధికారి మధు పేర్కొన్నారు. 

Similar News

News April 25, 2025

పైసా ఫీజు లేకుండా భూ పరిష్కారం: కలెక్టర్

image

భూ భారతి చట్టం-2025 ద్వారా రైతుల భూ సమస్య తీర్చడానికి ప్రభుత్వం ద్వారా ఒక పైసా వసూలు చేయబోమని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. డోర్నకల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల్లో ప్రజలకు ఎదురైన అనేక ఇబ్బందులను సరిదిద్దుతూ, అన్ని విధాలుగా ఆలోచించి ఈ నూతన చట్టాన్ని రూపొందించారన్నారు.

News April 25, 2025

KMR: ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ MLAకు బెదిరింపులు

image

జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావును బ్లాక్‌ మెయిల్ చేసిన ఓ రిపోర్టర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. MLAకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతానని ఓ మహిళతో కలిసి శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు MLA ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు.

News April 25, 2025

షీ టీంపై పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన

image

షీ టీం పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

error: Content is protected !!