News January 27, 2025

నరసరావుపేట: సర్వేలు సకాలంలో పూర్తి చేయాలి

image

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో నిర్వహించే సర్వేలను రెండురోజుల్లో పెండింగ్ లేకుండా పూర్తి చేయించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News February 14, 2025

వరంగల్ ఎంజీఎంలో పోలీసుల తనిఖీలు

image

విజిబుల్ పోలీసింగ్‌తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా మట్టెవాడ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎంజీఎంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ ఎస్ఐ విఠల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News February 14, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.

News February 14, 2025

పీఎం శ్రీ పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులను వినియోగించాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు సత్వరమే వినియోగించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంపిక చేసిన పాఠశాలల్లో పీఎం శ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించారు.

error: Content is protected !!