News April 16, 2025
నరసరావుపేట: సినిమాలో ఎమ్మెల్యే చదలవాడ

ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.
Similar News
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.


