News June 19, 2024
నరసరావుపేట సైబర్ నేరాలు.. లోన్ యాప్‌లపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

శాంతిభద్రతల స్థాపనలో సచివాలయ, మహిళా పోలీసులు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. మహిళా పోలీసులు వారి విధులు గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు. సైబర్ నేరాలు లోన్ యాప్‌లపై అవగాహన పెరగాలన్నారు. రౌడీషీటర్లపై అవగాహన కలిగి ఉండి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News September 19, 2025
గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News September 19, 2025
అసెంబ్లీ మార్షల్స్‌పై మంత్రి లోకేశ్ సీరియస్

అసెంబ్లీలో MLAలు, మీడియాపై మార్షల్స్ దురుసు ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. MLA ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా మార్షల్స్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేంద్రపై చేయి వేసి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.
News September 19, 2025
తాగునీటిలో మురుగునీరు కలవడంతోనే సమస్య: సీపీఎం

గుంటూరులో డయేరియా వ్యాప్తిపై సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌లో డయేరియా రోగులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే 33 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షాలకు మురుగు నీరు తాగునీటి పైపుల్లో కలిసి ప్రజలకు సరఫరా అవుతోందని ఆరోపించారు.