News February 3, 2025
నరసరావుపేట: సోమవారం గ్రీవెన్స్ రద్దు చేసిన జిల్లా ఎస్పీ

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వివరాలు తెలిపారు. గుంటూరు- కృష్ణా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News October 25, 2025
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను పకడ్బందీగా చేపట్టాలి: సుదర్శన్ రెడ్డి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ములుగు నుంచి కలెక్టర్ దివాకర, ఆర్డీవో వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. 2002 తర్వాత ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారుల సహకారం తీసుకొని ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు.
News October 25, 2025
HATS OFF: ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాడు

AUSతో వన్డే సిరీస్లో అదరగొట్టిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ విమర్శకుల నోళ్లు మూయించారు. ఫామ్ లేమితో జట్టు నుంచి తప్పుకున్న చోటే సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో AUSతో టెస్టు సిరీస్లో విఫలమైన రోహిత్ కెప్టెన్ అయినప్పటికీ టీమ్ కోసం సిడ్నీ మ్యాచ్ నుంచి వైదొలిగారు. ఇవాళ అదే సిడ్నీలో సూపర్ సెంచరీ(121*)తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఎక్కడ తగ్గారో అక్కడే నెగ్గి చూపించారు.
News October 25, 2025
ప్లానిటోరియం, గార్డెన్ పనుల పరిశీలించిన GWMC కమిషనర్

బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో చేపడుతున్న ప్లానిటోరియం, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ (కేఎంజీ) పనులను కమిషనర్ / కుడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్పాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈలు రవి కుమార్, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.


