News February 3, 2025
నరసరావుపేట: సోమవారం గ్రీవెన్స్ రద్దు చేసిన జిల్లా ఎస్పీ

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వివరాలు తెలిపారు. గుంటూరు- కృష్ణా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 9, 2025
ఉప్పల్‌లో డెలివరీ బాయ్ సూసైడ్!

ఉప్పల్ పీఎస్ పరిధి కురుమానగర్‌లోని ఓ ఇంట్లో వట్టిపల్లి శ్రావణ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి కురుమానగర్‌లో ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని శ్రవణ్ కుమార్ సోదరుడు సందీప్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ మార్చురీకి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏటూరునాగారం: రేపటి ఐటీడీఏ గిరిజన దర్బారు రద్దు

ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగనున్న గిరిజన దర్బారు రద్దు చేసినట్లు పీవో చిత్రమిశ్రా ఆదివారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున గిరిజన దర్బారు నిర్వహించడం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని పీవో కోరారు. దరఖాస్తులతో ఐటీడీఏకి రావద్దని సూచించారు.