News January 25, 2025
నరసరావుపేట: హాస్టల్లో గర్భం దాల్చిన విద్యార్థిని

నరసరావుపేట పట్టణంలోని SC గర్ల్స్ హాస్టల్లో మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి గుంటూరు GGHకి తరలించారు. విద్యార్థిని పిడుగురాళ్లలోని నర్సింగ్ కాలేజీలో GNM మొదటి సంవత్సరం చదువుతోంది. గర్భం పోగొట్టేందుకు అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థతకు గురైంది. రక్త స్రావం అధికమవడంతో సిబ్బంది హాస్పిటల్కు తరలించారు.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల జిల్లాలో మహిళా ఓటర్లు.. ఎందరంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11,787 అధికంగా ఉన్నాయి. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డుల పరిధిలో 3,53,351 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,70,772 మంది పురుషులు, 1,82,559 మంది మహిళలు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 40,886 మంది ఓటర్లు ఉండగా, వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 11,727 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆదివారం పూర్తికానుంది.
News November 22, 2025
HYD: KPHBలో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.