News March 17, 2025
నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 27, 2025
సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.
News November 27, 2025
సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.
News November 27, 2025
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ సమీక్ష

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.


