News March 7, 2025

నరసరావుపేట: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణం

image

సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున నరసరావుపేటలో దారుణం జరిగింది. 1993 మార్చి 7న HYD నుంచి చిలకలూరిపేటకు వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతిచెందడం అప్పట్లో సంచలనమైంది.

Similar News

News December 5, 2025

VJA: భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!

image

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్‌ బాటిళ్లు, 325 మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్‌ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఆలయం వద్ద బారిగేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.

News December 5, 2025

బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

image

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

News December 5, 2025

పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, ఎస్పీ

image

రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారిని కలెక్టర్‌ కృతికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాటి కోనసీమగా పిలువబడే మంచికల్లులో ఎన్నో సంవత్సరాలుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు, డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.