News March 7, 2025

నరసరావుపేట: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణం

image

సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున నరసరావుపేటలో దారుణం జరిగింది. 1993 మార్చి 7న HYD నుంచి చిలకలూరిపేటకు వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతిచెందడం అప్పట్లో సంచలనమైంది.

Similar News

News July 6, 2025

ADB: రేపే లాస్ట్.. విద్యార్థులు APPLY చేసుకోండి

image

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రభుత్వం HYDలో అందించే 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఉమ్మడి ADBలోని SC, ST, BC, మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భగత్ సునీత కుమారి తెలిపారు. డిగ్రీ పాసైన వారు ఈనెల 7 వరకు tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో APPLY చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94941 49416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News July 6, 2025

వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

image

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్‌. సిటీలో దమ్ బిర్యానీ‌ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.
నేడు World Biryani Day