News October 6, 2024
నరసాపురంలో పదేళ్ల బాలికతో అసభ్యకర ప్రవర్తన

పదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపట్ల యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News November 14, 2025
తణుకు: మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు

తణుకు పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స నిర్వహించారు. పెనుగొండ మండలం దేవ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారు. కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమె గురువారం ఆసుపత్రికి రాగా..వైద్యురాలు పావని పరీక్షించి కణితి ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చికిత్స చేసి 4 కిలోల కణితిని తొలగించారు.
News November 14, 2025
ఉండి: ‘దివ్యాంగ పిల్లలను ఆదరించాలి’

సమాజంలో ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పిల్లలను ఆదరించాలని సహిత విద్య సమన్వయకర్త టి. శ్రీనివాసరావు అన్నారు. ఉండి నియోజకవర్గం స్థాయిలో ప.గో. జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు ఆయన అవగాహన కల్పించారు. MEO వినాయకుడు, భవిత కేంద్రం టీచర్ మధు, ఫిజియోథెరపిస్ట్ పాల్గొన్నారు.
News November 13, 2025
తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.


