News October 18, 2024
నరసాపురంలో యువతిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు

యువతితో గొడవపడి దాడిచేసి, బట్టలు చించివేసిన ప్రేమ్ కుమార్ పై గురువారం కేసు నమోదు చేశామని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. వారి వివరాలు.. పట్టణ వాసి నగీనా ఈ నెల 15న కాటన్ పార్కుకు వెళ్లగా.. అదే సమయంలో మొగల్తూరు వాసి ప్రేమ్ ఆమెతో గొడవపడి దాడి చేసి, బట్టలు చించివేశాడు. ఆ ఘటనపై నగీనా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
Similar News
News September 15, 2025
భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.
News September 15, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
News September 14, 2025
వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్‌లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.