News August 19, 2024
నరసాపురంలో 23న ‘ఉద్యోగ దిక్సూచి’: కలెక్టర్
ప.గో జిల్లాలో ఈనెల 20న జరగాల్సిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని SEP 17కు, ‘మాప్ అప్ దినం’ను SEP 25కు మార్చినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఏటా 2సార్లు నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జరుగుతుందని, అంగన్వాడీలు విద్యా సంస్థల్లోని 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. నరసాపురంలో 23వ తేదీన జరిగే ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 17, 2024
ప.గో.: చీపురు పట్టిన కేంద్ర మంత్రి, కలెక్టర్
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉన్నారు. అంతా కలిసి చెత్త ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేశారు.
News September 17, 2024
న్యాయం చేయమనాలంటే సిగ్గుగా ఉంది: RRR
వైసీపీ హయాంలో తనపై దాడి చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కాదంబరీ జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని, అలానే తనకు కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుక్కోవాలంటే సిగ్గుగా ఉందన్నారు.
News September 16, 2024
నరసాపురం: ఎరుపెక్కిన గోదావరి
నరసాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఉన్న గోదావరి ప్రాంతమంతా సోమవారం ఎరుపు రంగులో కనిపించిది. సాయంత్రం 5 గంటలకు సంధ్యా సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఎరుపు రంగులో కమ్ముకున్నాయి. దీంతో గోదారి రంగు మారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పలువురు ఈ చిత్రాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.