News January 8, 2025

నరసాపురం: అమ్మాయి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు

image

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్‌కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్‌ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.

Similar News

News November 11, 2025

దొంగలను పట్టించిన పసుపు రంగు చెప్పులు

image

భీమవరం నుంచి హైదరాబాద్‌‌కు వెళ్లి చోరీలు చేస్తున్న నలుగురు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. 2 రాష్ట్రాల్లో వీరిపై 12 కేసులు నమోదవ్వగా సౌత్ ఈస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై చోరీ ప్రాంతాల్లోని సీసీ, ఫింగర్ ప్రింట్‌లను పరిశీలించగా..ఓ చోరుడి పసుపు రంగు చెప్పులు విభిన్నంగా కనిపించాయి. దీంతో నిఘా పెంచి నాదర్‌గుల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని నిన్న మీడియాకు వెల్లడించారు.

News November 11, 2025

కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సస్పెండ్

image

కాళ్ళ జడ్పీ హైస్కూల్ హెచ్ఎం‌ను సస్పెండ్ చేస్తూ డిఈఓ నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల వచ్చిన ‘కుళ్లిన గుడ్లతో భోజనమా’ అనే వార్తపై వెంటనే విచారణ జరిగిందన్నారు. పాఠశాలలో 450 మంది విద్యార్థులకు 150 మంది మాత్రమే భోజనం చేస్తున్నారని నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో హెచ్ఎం ను సస్పెండ్ చేశారు.

News November 10, 2025

14, 15 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

image

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జరగనున్నాయి. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా క్యాడర్ అంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. కృష్ణయ్య, కె. ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఆక్వా సంఘం నాయకులు బి. బలరాం తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.