News January 8, 2025

నరసాపురం: అమ్మాయి ఆత్మహత్య కేసులో యువకుడి అరెస్టు

image

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని ప్రగతి నగర్‌కు చెందిన సాయి లక్ష్మి కుమారి(19) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిసిన వివరాలు ప్రకారం.. ఈ కేసులో గీతా చరణ్‌ను మంగళవారం యర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మెరకలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నరసాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు SI సురేష్ తెలిపారు.

Similar News

News January 17, 2025

ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం

image

హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.

News January 17, 2025

మొగల్తూరులో అల్లుడికి 153 రకాల వంటకాల విందు

image

మొగల్తూరుకు చెందిన కెల్లా లక్ష్మీ కాంతం అల్లుడికి 153 రకాలతో విందు ఏర్పాటు చేశారు. తన కూతురు నాగలక్ష్మిని పాలకొల్లుకి చెందిన చిప్పాడ విజయ కృష్ణతో 29 ఏళ్ల క్రితం  వివాహం జరిపించారు. కొత్త అల్లుడికి ఏమాత్రం తీసిపోకుండా 153 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 

News January 17, 2025

ఏలూరు: అధికారులను మెచ్చుకున్న మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు బేష్ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం జిల్లా అధికారులను అభినందించారు. రూ.734 కోట్ల విలువైన 3.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని అన్నారు. 96% రైతులకు 24 గంటల్లోనే సొమ్ము చెల్లించినట్లు వివరించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటిగా ఏలూరులోనే ప్రారంభమైందన్నారు. ధాన్యం సేకరణపై అధికారుల చొరవ ప్రశంసనీయమన్నారు.