News February 8, 2025
నరసాపురం: ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

నరసాపురంలోని మాధవాయిపాలెం – సఖినేటిపల్లి రేవును శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు పోలీస్ వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ తెలిపారు.
Similar News
News April 22, 2025
ప.గో: అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి- జేసి

రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారితనం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లోని సమస్యలపై చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు.
News April 22, 2025
‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.
News April 21, 2025
ప.గో: పీజీఆర్ఎస్కు 42 ఫిర్యాదులు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 42 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.