News February 2, 2025
నరసాపురం ఎమ్మెల్యే కారుకి ప్రమాదం
మచిలీపట్నం దగ్గర నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Similar News
News February 3, 2025
ఆదిలాబాద్: దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించటానికి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DWO సబిత తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 12 తేదీ లోపు https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం క్రింద బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50 వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 యూనిట్లు జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.
News February 3, 2025
వచ్చే వారం 4 ఐపీవోలు
మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఈ నెల 4-10వ తేదీల మధ్య నాలుగు కంపెనీలు IPOకు రానున్నాయి. ఎలిగాంజ్ ఇంటీరియర్స్ రూ.78.07 కోట్లు, అమ్విల్ హెల్త్ కేర్ రూ.59.98 కోట్లు, రెడ్మిక్స్ కన్స్ట్రక్షన్ రూ.37.66 కోట్లు, చాముండా ఎలక్ట్రానిక్స్ రూ.14.60 కోట్లు సేకరించనున్నాయి. అలాగే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పాని పైప్స్ కంపెనీలు లిస్ట్ కానున్నాయి.
News February 3, 2025
జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ.. జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో PM మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయన్నారు. మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు. చంద్రచూడ్ నిజాయితీపరుడని, కోర్టు వ్యవహారాలపై PMతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు. కాగా జస్టిస్ రాయ్ నిన్న పదవీ విరమణ చేశారు.