News February 2, 2025

నరసాపురం ఎమ్మెల్యే కారుకి ప్రమాదం

image

మచిలీపట్నం దగ్గర నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం  ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Similar News

News February 19, 2025

‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.

News February 19, 2025

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

image

ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. షాహిస్తా తబుసం, యశ్రబ్ స్కాలర్షిప్‌కు ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

News February 19, 2025

KCR ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు: మంత్రి

image

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని <<15513169>>KCR<<>> ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారు. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడితే ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌లేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.

error: Content is protected !!