News July 26, 2024
నరసాపురం- కోటిపల్లి లైన్‌కు మహర్దశ

నరసాపురం రైల్వేలైన్‌కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం- కోటిపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం- మచిలీపట్నం మధ్య రైల్వే లైను ఏర్పాటుచేయాలని.. దీనిపై సర్వే చేసేందుకు నిధులు కేటాయించారు.
Similar News
News November 20, 2025
బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 20, 2025
తాడేపల్లిగూడెం: సోషల్ మీడియాలో వేధింపులు.. ఇద్దరిపై కేసు

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన ఓ మహిళపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టి, బెదిరించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. నిందితులు సురేశ్, శివప్రసాద్ తనను రూ.లక్ష ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వెల్లడించారు.
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.


