News July 26, 2024

నరసాపురం- గుంటూరు రైలు రద్దు

image

రైలు పట్టాల పునరుద్ధరణ, నిర్వహణ పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు మచిలీపట్నం- విజయవాడ, నరసాపురం- విజయవాడ, విజయవాడ- భీమవరం రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నరసాపురం- గుంటూరు రైలును ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News November 27, 2025

కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

image

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.