News December 13, 2024
నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్టర్ సస్పెండ్
వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై నరసాపురం ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఎంవీటీ ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఓ భూమికి అడంగళ్ రికార్డులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక దర్యాప్తు చేయగా.. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News January 20, 2025
బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.
News January 20, 2025
భారత జట్టుకు ఏలూరు ఎంపీ శుభాకాంక్షలు
ఖోఖో ప్రపంచకప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లోనే భారత మహిళలు, పురుషుల జట్లు విశ్వవిజేతలుగా నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.
News January 20, 2025
ఏలూరు: ప్రియుడి ఇంటి ముందు ధర్నా
ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె వివరాల ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం అరుంధతి కాలనీకి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెళ్లి చేసుకోమని అడిగితే దుర్భాషలాడి దాడి చేశారని.. తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది.