News July 28, 2024

నరసాపురం నుంచి నాగర్‌సోల్‌కు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం నుంచి నాగర్‌సోల్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురంలో రైలు బయలుదేరుతుందన్నారు. మార్గమధ్యలోని పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా నాగర్‌సోల్ చేరుకుంటుందని చెప్పారు.

Similar News

News September 19, 2025

కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి: కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ – ఆఫీస్ ఫైల్స్ విధానం తప్పనిసరి అని, జిల్లా ప్రగతికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పలు అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కలెక్టర్‌కు వచ్చే ప్రతి దస్త్రం తప్పనిసరిగా ఇ-ఆఫీస్ ఫైల్ విధానంలోనే రావాలన్నారు. కాగితం దస్త్రాలను క్రమేపి తగ్గించాలన్నారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.

News September 18, 2025

పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.